ఎన్నికలు (Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) దూకుడు పెంచింది. పోలింగ్ తేదీ వరకు వీలైనంత మంది పార్టీ జాతీయ నేతలను రాష్ట్రానికి పిలిపించి ప్రచారం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 17న రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు.
17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో నిర్వహించే సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. మొత్తం ఆరు రోజుల పాటు ఆయన ేప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే ఈ మేరకు రెండు హెలికాప్టర్లను కాంగ్రెస్ సిద్ధం చేసుకుంది. అదే రోజు రాష్ట్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశాలు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వారి పర్యటనకు సంబంధించి తేదీలను రేపు ఖరారు చేసే అవకాశం ఉంది. పలు తేదీల్లో వారు ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలను కవర్ చేసేలా వీఐపీ పర్యటనలకు కాంగ్రెస్ ప్రణాళికలు రెడీ చేస్తోంది.
స్వ
ఇది ఇలా వుంటే ఈ నెల 7 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రోజుకు మూడు నియోజక వర్గాల చొప్పున ఆయన ప్రచారం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ పరిస్థితులపై సమీక్షించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం, నేతల మధ్య విభేదాల గురించి ఆయన ఏఐసీసీ పరిశీలకులతో సమీక్షించినట్టు సమాచారం.