Telugu News » Congress : రేపటి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర…. రూట్ ఇదే….!

Congress : రేపటి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర…. రూట్ ఇదే….!

రేపు సాయంత్రం రామప్ప ఆలయానికి ఇరువురు నేతలు చేరుకుంటారు. మొత్తం 8 నియోజక వర్గాల్లో బస్సు యాత్రను చేపట్టనున్నారు.

by Ramu

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) దూకుడు పెంచింది. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతోంది. ప్రచారంలో భాగంగా మొదట బస్సు యాత్ర (Bus Yatra) ను ఆ పార్టీ చేపడుతోంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీలు రేపు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం రామప్ప ఆలయానికి ఇరువురు నేతలు చేరుకుంటారు. మొత్తం 8 నియోజక వర్గాల్లో బస్సు యాత్రను చేపట్టనున్నారు.

రాహుల్ గాంధీ రేపు ఢిల్లీలో ప్రత్యేక విమానంలో బయలు దేరి రేపు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి హెలికాప్టర్ లో రామప్ప ఆలయానికి చేరుకోనున్నారు. అక్కడ ఆలయంలో దేవుని ముందు ఆరు గ్యారెంటీలను పెట్టి పూజలు చేయనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు బస్సు యాత్రను చేపట్టనున్నారు.

అక్కడి నుంచి మొదట బస్సు యాత్ర ములుగుకు చేరుకోనుంది. ములుగులో మహిళలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి యాత్ర భూపాల పల్లికి చేరుకోనుంది. భూపాల పల్లిలో నిరుద్యోగులతో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. రెండో రోజు భూపాల పల్లి నుంచి మంథనికి యాత్ర చేరుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఆ తర్వాత మంథని నుంచి పెద్దపల్లికి అక్కడి నుంచి కరీంనగర్ కు బస్సుయాత్ర చేరుకుంటుంది. రాత్రి కరీంనగర్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. మరుసటి రోజు కరీంనగర్ నుంచి బోధన్ చేరుకుటుంది. బోధన్ చెక్కర కర్మాగారాన్ని రాహుల్ గాంధీ పరిశీలిస్తారు. అనంతరం ఆర్మూర్ లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నిజామాబాద్ చేరుకుని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. దీంతో ఆయన బస్సు యాత్ర పూర్తవుతుంది.

 

You may also like

Leave a Comment