వరల్డ్ కప్ (World Cup)లో టీమిండియా (India) ఓటమిపై ప్రధాని మోడీ (PM Modi)ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా రాహుల్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్రంగా మండిపడ్డారు.
ప్రపంచకప్‌లో భారత ఓడిపోవడంతో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ చాలా సంతోషంగా ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇప్పుడు జాతీయ సమస్యగా మారారని ఫైర్ అయ్యారు. రాజస్థాన్ బన్వారాలోని భాగీడోరా నియోజక వర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో శివరాజ సింగ్ చౌహన్ పాల్గొన్నారు.
ఎన్నికల ర్యాలీలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ…. రాహుల్ గాంధీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ సమస్య కాదని అన్నారు. ప్రస్తుతం జాతీయ సమస్యగా రాహుల్ గాంధీ మారారని ధ్వజెమెత్తారు. రాహుల్ గాంధఈ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు రోజు ఆసత్యాలు చెబుతారని ఆరోపించారు. వారికి ఎలా ప్రసంగించాలో తెలియదని ఎద్దేవా చేశారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రధాని మోడీ వెళ్లారని అని తెలిపారు. టీమిండియా విజయం సాధించాలని యావత్ దేశం మొత్తం ప్రార్థనలు చేసిందన్నారు. కానీ దురదృష్టవశాత్తు టీమిండియా ఓడిపోయిందన్నారు. దీంతో దేశం మొత్తం కన్నీరు పెట్టుకుందన్నారు. కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని నిప్పులు చెరిగారు.