గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Mla RajaSing)పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని మహరాజ్ గంజ్(Maharaj Ganj) పోలీసులు కేసు నమోదు చేశారు. సుమోటో చర్యలను ప్రారంభించిన మంగళ్‌హాట్ పోలీసులు ఆర్పీ చట్టం 1951, సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు.
మహరాజ్‌గంజ్ భవన్‌లో రాజాసింగ్ రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేశాడని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ అస్లాం తెలిపారు. ముస్లింలను ఉద్దేశించి బీజేపీ నేత టి రాజాసింగ్ హిందీలో చేసిన ప్రసంగానికి సంబంధించిన క్యాప్షన్లతో కూడిన 51 సెకన్ల వీడియో బయటపడిందని ఎస్ఐ వెల్లడించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే మాటలు ఇలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే.. రాజాసింగ్ తన ప్రసంగంలో లవ్ జిహాదీలు, హిందూ కుమార్తెల మధ్య పోరాటం అంటూ రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ తెలిపారు. ఆ వీడియోలో రాజాసింగ్ ఏమన్నారంటే.. మన పోరాటం జిహాదీ వర్సెస్ హిందూ బిడ్డలది.. ఈ పోరాటం ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. గోషామహల్ అసెంబ్లీ స్థానం పేరు కేవలం తెలంగాణ, భారత్‌లోనే కాదు. మొత్తం విశ్వానికే తెలుసని అన్నారు.
ఈ విధాన సభలో రాజా సింగ్ అనే పేరుతో ఒక చిన్న హిందూ కరసేవకుడు ఉంటాడు.. లవ్ జిహాద్ ఘటనలకు మూతి పగలగొట్టే సమాధానం చెబుతూ ఉంటాడు.. ఈ విషయం మొత్తం విశ్వానికి తెలుసు. ఎవరో ఒకరైతే ఉన్నారు కదా.. అందుకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు.’ అని రాజాసింగ్ ఉద్వేగభరితంగా ప్రసంగిచారు. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలను ఎస్ఐ ఫిర్యాదులో పేర్కొన్నారు.