విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్(Rajeev Ratan) గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం ఉదయం ఆయన ఇంట్లో ఉండగా గుండెపోటు రాగా ఆయనను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీకి కుటుంబ సభ్యులు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతుండగా మృతిచెందినట్లు సమాచారం. రాజీవ్ రతన్ 1991వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. విధి నిర్వహణలో సౌమ్యుడు, సమర్థుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. రజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పని చేశారు. అలాగే ఆప రేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. రాజీవ్ రతన్ మృతి పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను గుర్తుచేసుకున్నారు. సమర్థవంతంగా పని చేసిన అధికారులను తెలంగాణ సమాజం మరిచిపోదని పేర్కొన్నారు.