రజనీకాంత్( Rajani kanth)..అంటే స్టైల్ ,స్వచ్ఛమైన స్మైల్. రజనీ అంటే జీవితాన్ని నేర్పే డైలాగ్స్, రజనీ అంటే రికార్డ్స్. ఆయన వయసుతో సంబంధం లేదు. కుర్ర హీరోలతో కూడా పోటీపడతాడు..!
సినిమా హిట్టూ ప్లాపులతో సంబంధం లేదు, జస్ట్ స్క్రీన్ పై కనిపించి కలెక్షన్స్ రాబడతాడు. ఇక వ్యక్తిత్వం ఒక తత్త్వం. ప్రత్యేక విమానంలోనూ వెళ్లగలరు, నేల మీదా నడవ గలరు.
రజనీ గొప్ప హీరో మాత్రమే కాదు , గొప్ప మనిషి కూడా. ఎన్నో సందర్భాల్లో ఆయన ఉదాత్తమైన మనసు చాటుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ..రజనీని వెండితెరపై చూసి రెండేళ్లు అవుతోంది.
దీంతో ఫ్యాన్స్ ‘ జైలర్( jailer)’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు10న ప్యాన్ ఇండియన్( Pan Indian) స్థాయిలో ఆ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ విషయంలో జైలర్ ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది.అమెరికాలో ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.
అయితే రజనీకాంత్ ఈ హంగామాలకు ఆర్భాటాలకు నిమిత్త మాత్రుడు. సినిమా విడుదల దగ్గర పడుతున్నాకూడా అది ఏ మాత్రం తలకెక్కించుకోకుండా హిమాలయాలకు పయనమయ్యాడు.
ఓ హీరోగా కాకుండా ఓ మామూలు వ్యక్తిలా, ఓ ఆధ్యాత్మిక వేత్తలా అతన్ని అతను సంస్కరించుకుంటారు. కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ కొన్నాళ్లు ధ్యానం చేసుకోవడం మళ్లీ సినిమాలు చేయడం..ఇదే గత కొన్నేళ్లుగా రజనీ జీవితం.
ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, రిలీజ్ కు ముందు ఇలా హిమాలయాలకు వెళ్లి కొన్నాళ్లు అక్కడ గడిపి వస్తుంటారు.అయితే కొవిడ్ (Covid)కారణంగా గత నాలుగేళ్ల నుంచి అక్కడకు వెళ్లడం లేదు.
అందుకే జైలర్ రిలీజ్ ఉన్నా సరే ఈ ఏడాది హిమాలయాలకు వెళ్లిపోయారు. ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్.. ప్రపంచవ్యాప్తంగా (World wide) చాలా స్క్రీన్స్ లో విడుదల కానుంది.
నెల్సన్ దిలీప్‌కుమార్( Nelson Dilip Kumar ) లాంటి ఒక పక్కా కమర్షియల్, ఎంటర్‌టైనింగ్ దర్శకుడితో చేతులు కలిపి రజనీ తెరకెక్కించిన సినిమా కాబట్టి దీనిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.