మన సరిహద్దులు, దేశం పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.. సైన్యం పై దేశ ప్రజలు విశ్వాసంతో ఉండాలని తెలిపారు.. నేడు టైమ్స్ నౌ సమ్మిట్ ముగింపు సందర్బంగా మాట్లాడిన ఆయన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్ని బయటకు వెల్లడించలేమని పేర్కొన్నారు.. ఐదేళ్లు రక్షణ మంత్రిగా, అంతకుముందు హోం మంత్రిగా ఉన్న నేను, అన్ని పరిస్థితులను చూశాక ఈ మాటలను తెలుపుతున్నటు వెల్లడించారు..
ఇక సరిహద్దు దేశాలతో వివాదాలున్నప్పటికి ఆ ఉద్రిక్తతల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.. ఇందులో భాగంగా విస్తృతమైన దౌత్య, సైనిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నామని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.. కాగా పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో మే 5, 2020న జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ (Ladakh) సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే..
అయితే ఈ సమస్యను సైనిక, దౌత్యపరమైన చర్చల ద్వారా ఇరుపక్షాలు పరిష్కరించాయని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. అలాగే అగ్నివీర్ (Agniveer recruitment scheme) గురించి మాట్లాడిన ఆయన, ఇది సాయుధ బలగాలను ఆధునీకరించడంలో సహాయపడుతుందని తెలిపారు.. అవసరమైతే అగ్నివీర్ రిక్రూట్మెంట్ స్కీమ్‌లో మార్పునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు..
రక్షణ దళాల్లో యువతరం అవసరమని, వారు మరింత ఉత్సాహంగా ఉన్నారని భావిస్తున్నట్లు వెల్లడించారు.. వారంతా టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్నవారని తెలిపారు.. ఇదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో (Atmanirbhar Bharat programme) భాగంగా భారత్‌ను ఇంజిన్లు ఎగుమతి చేసే దేశంగా మార్చాలని భావిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.. ఈ విషయంలో పూర్తి సమాచారం సేకరించాలని డీఆర్డీఓను కోరినట్లు తెలిపారు..