అయోధ్య (Ayodhya) కోసం ప్రజలంతా వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో జ్యుయెల్లరీ (Jwellery)థలు ప్రత్యేక నగలు తయారు చేస్తున్నాయి. రాముని రూపంలో ఉండే ఆభరణాలు, ఉంగరాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నాయి. ఆ ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని కంపెనీలు చెబుతున్నాయి.
రామ మందిర రూపంలో ఉన్న ఆభరణాలు, ఉంగరాలను భక్తుల నుంచి భారీగా డిమాండ్ వస్తోందని లక్నోకు చెందిన బంగారు వ్యాపారి ఆదిశ్ జైన్ వెల్లడించారు. రామ మందిర రూపంలో ఉన్న ఆభరణాలు కావాలంటూ భక్తుల తమను కోరుతున్నారని చెప్పారు. రామ మందిర నమూనా ఉంగరాలు, ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు.
తమకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాతే వాటిని భక్తులకు అందజేస్తామన్నారు. ఆంజనేయ స్వామి లాకెట్లను సైతం విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. జై శ్రీ రామ్ అని రాసి ఉన్న లాకెట్లు, ఆభరణాలకు ఫుల్ డిమాండ్ ఉందన్నారు. రామమందిర రూపంలో ఉన్న వెండి ఆభరణాలకూ ఫుల్ గిరాకీ ఉందని చెప్పారు.
ఇక మరోవైపు అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపుర్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి శ్రీరాముడిపై తమ అభిమానాన్నిచాటుకున్నారు. “సియావర్ రామచంద్ర కీ జై” అనే ఆకృతిలో దీపపు రమిదలను వెలిగించారు.