Telugu News » Rammohan Naidu : ఏపీ సీఐడీ చీఫ్ పై అమిత్ షాకు ఫిర్యాదు !

Rammohan Naidu : ఏపీ సీఐడీ చీఫ్ పై అమిత్ షాకు ఫిర్యాదు !

చట్టం ముందు అందరిని సమానంగా చూడాల్సిన పోలీసు విభాగానికి చెందిన వారు కొందరికి కొమ్ము కాయడం వలన చట్టంపై గౌరవం పోతుందని రామ్మెహన్ నాయుడు అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో తెలిపారు.

by Prasanna

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు (Amit Sha) సీఐడీ చీఫ్ (CID Chief) సంజయ్‌పై తెలుగు దేశం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు (TDP MP Rammohan Naidu) ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ సంజయ్ వ్యవహరించడమే కాకుండా వైసీపీకి తొత్తుగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో రామ్మెహన్ నాయుడు పేర్కొన్నట్లు సమాచారం.

చట్టం ముందు అందరిని సమానంగా చూడాల్సిన పోలీసు విభాగానికి చెందిన వారు కొందరికి కొమ్ము కాయడం వలన చట్టంపై గౌరవం పోతుందని రామ్మెహన్ నాయుడు అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. ముఖ్యంగా ఆల్ ఇండియ‌న్ స‌ర్వీస్ రూల్స్ మేర‌కు రాజ‌కీయ ప‌క్షపాతాలు లేకుండా ప‌నిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించార‌ని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీ కార్యక‌ర్త మాదిరిగా ప‌నిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజ‌య్, సీఎం వైఎస్ జ‌గ‌న్ కోసం ప్రతిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారని, ఇలాంటి వారు పదవిలో ఉంటే ప్రజలకు మేలు జరగదని తెలిపారు. ప్రముఖులను అరెస్ట్ చేసినప్పుడు పాటించాల్సిన నియమాలను కూడా పక్కన పెట్టి వైసీపీ అధినాయకత్వం మెప్పుకోసం అనేక తప్పులు చేశారని ఆరోపించారు.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ప్రతిపక్షనేత చంద్రబాబుని అరెస్టు చేసి విచార‌ణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే, స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కి వ్యతిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్రమైన నేరంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ద‌ర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టుల‌కి నివేదించాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి  వైసీపీ కార్యకర్తలా వ్యవహారిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ద‌ర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుద‌ల చేస్తున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

 

You may also like

Leave a Comment