టాలీవుడ్ హిట్ జోడి ‘రష్మికా మందన్నా-విజయ్ దేవరకొండ’(Rashmika-vijay) మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది. చాలా కాలంగా వీరిద్దరు వరుస సినిమాలతో చాలా బిజీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ఫ-2 సినిమాతో బిజీగా ఉండగా.. విజయ్ ఫ్యామిలీ మాస్టర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
గతంలో వీరిద్దరూ కలిసి ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కలిసి నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. విజయ్-రష్మిక మధ్య సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ బాగా పండుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
వీరి కాంబోలో కొత్త సినిమా ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఖాళీ దొరికితే చాలు వీరిద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. రష్మిక-విజయ్ మధ్య బాండింగ్ చూసి లవర్స్ అని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ, వాటిని ఈ తారలు కొట్టిపడేశారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెబుతుంటారు.
తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా రౌడీ బాయ్ విజయ్ను పార్టీ అడిగింది. అతను నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ విడుదలకు సిద్ధం కావడంతో ‘నా డార్లింగ్స్ విజయ్- దర్శకుడు పరుశురాం’కు శుభాకాంక్షలు. మీ సినిమా మంచి విజయం సాధించాలి.మృణాల్ ఠాకూర్‌కు ఆల్ ది బెస్ట్. పార్టీ కావాలి’ అని ట్వీట్ చేయగా.. దీనికి రౌడీ బాయ్ విజయ్ ‘క్యూటెస్ట్ అంటూ రెండు లవ్ సింబల్స్’ యాడ్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు.