స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కుర్రకారు గుండెల్లో ప్రత్యేక చోటు సంపాదించుకుంది. అయితే, సక్సెస్, ఫెయిల్యూర్స్‌పై షాకింగ్స్ కామెంట్స్ చేసింది రష్మిక. తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘సినిమా రంగంలోనే కాదు.. ఏ రంగంలోనైనా ఓటములు సహజమే. విజయాన్ని ఎప్పుడూ తలకు ఎక్కించుకోవద్దు. అలా చేస్తే ముందడుగు వేయలేం. గర్వం పెంచుకున్న క్షణం మన పతకానికి పునాదులు వేసుకున్నట్లే..’ అని చెప్పుకొచ్చింది. అలాగే తనకంటే ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నారని, తనకు మంచి అవకాశాలు రావడంతో ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది.
జీవితంలో సంతోషాన్ని, పొందిన విజయాలను సాధారణంగా భావించొద్దని తెలిపింది. రష్మిక మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా ఇటీవలే రణ్‌బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన యానిమల్ చిత్రంలో నటించి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రం దాదాపు 900 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.
అంతకుముందే అల్లు అర్జున్‌తో నటించిన ‘పుష్ప’ మూవీ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2(Pushpa-2) సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప-2 సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్లో రష్మిక డిఫరెంట్ లుక్‌లో కనిపించింది.