నటి విజయశాంతి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. విజయశాంతి మనందరికీ పరిచయమే. టాలీవుడ్ లో మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో వచ్చి జనాల్ని మెప్పించారు విజయశాంతి. ఒకానొక టైం లో ఆమె వరుస సూపర్ డూపర్ హిట్లు కొట్టేసి పెద్ద హీరోయిన్లకే పోటీని ఇచ్చారు. హీరోలకి దీటుగా యాక్షన్ ఎపిసోడ్లలో నటించేవారు విజయశాంతి. ఈమె ఎంత అద్భుతంగా నటించేవారు అంటే ఈమెని అందరు లేడీ అమితాబ్ అని పిలిచేవారు. ఈమె సినిమాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు పూర్తయింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి తర్వాత మళ్ళీ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకు ఎవరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు. విజయశాంతి వ్యక్తిగత జీవితం చాలా మందికి తెలియదు. విజయశాంతి పేరు వెనక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయశాంతి అసలు పేరు శాంతి మాత్రమే. అయితే విజయశాంతి పిన్ని అయిన విజయ లలిత కూడా అలనాటి నటి ఆమె ప్రోత్సాహంతోనే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చారు. విజయశాంతి ఏడవ ఎటన బాలనటిగా సినీ ఇండస్ట్రీకి వచ్చారు.
Also read:
ఆమెని హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేశారు భారతీయ రాజా. విజయశాంతి తన శాంతి పేరుకు ముందు తన పిన్ని విజయ లలిత పేరులోని విజయ అనే పేరుని యాడ్ చేసుకోవడం జరిగింది. ఇలా శాంతి కాస్త విజయశాంతిగా మారింది అప్పటినుండి కూడా విజయశాంతిగా ఈమె కొనసాగారు. రాజకీయాల్లోకి కూడా విజయశాంతి వచ్చారు. మెదక్ నుండి ఎంపీగా విజయం సాధించారు విజయశాంతి.