బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు(Ex mla Shakil son Raahil) రాహీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అతన్ని రెండు వారాల పాటు అరెస్టు చేయొద్దని కోర్టు స్టే(Stay) విధించడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షకీల్ కుమారుడిపై హిట్ అండ్ రన్ (Hit and Run case) కేసుతో పాటు ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహీల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
అర్థరాత్రి ప్రగతి భవన్ వద్ద గేట్లను రాహిల్ కారు ఢీకొట్టి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతన్ని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. వెంటనే అక్కడకు మాజీ ఎమ్మెల్యే షకీల్ చేరుకుని ఆ కేసులో వేరే వ్యక్తిని ఇరికించి తన కొడుకును విదేశాలకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే షకీల్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, దుబాయ్ నుంచి రాహిల్ హైదరాబాద్ వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఈనెల 8న అతన్ని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని పంజాగుట్ట స్టేషన్ కు తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా.. ఏప్రిల్ 22 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
తాజాగా రాహీల్‌ను హైకోర్టులో హాజరపరచగా.. అతని అరెస్టుపై విచారణ జరిపిన కోర్టు.. రెండు నెలల పాటు స్టే విధించింది. ఇప్పట్లో అతన్ని అరెస్టు చేయొద్దని పంజాగుట్ట పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా, రాహీల్ గతంలో చేసిన కారు యాక్సిడెంట్లో ఓ చిన్నారి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.