మాస్ మహరాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రవితేజ కి మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మించిన ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించడం జరిగింది. స్టువర్టుపురం గజదొంగ గా రవితేజ ఈ సినిమాలో అలరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వడం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ కనపడి ఆకట్టుకు పోతున్నారు.
Also read:
రేణు దేశాయ్ రీయంట్రి ఇస్తుండడం తో ఆమె ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. బద్రి జానీ సినిమాలతో రేణు దేశాయ్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు తమిళంలో కూడా ఈమె ఒక సినిమా చేశారు. మొత్తం మూడు సినిమాల్లో నటించి ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేసారు. మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఈమె సినిమాల్లోకి రాబోతున్నారు. రేణు దేశాయ్ నటించే ఈ పాత్ర కూడా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.
హేమలత లవణం పాత్ర ఆమె చేయడంతో ఆమె ఎవరా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ రచయిత గుర్రం జాషువా కూతురు హేమలత లవణం. ఆమె సంఘసంస్కర్త. తండ్రి బాటలో నడిచి ఈమె రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. జాతి వివక్ష, అంటరానితనం అనే అంశాల మీద ఈమె ఎంత గానో పోరాడారు. 19వ దశకంలో భర్తతోపాటుగా నేరస్తుల్లో మార్పు తీసుకువచ్చారు హేమలత లవణం. ఆ టైంలోనే స్టువర్టుపురం గజ దొంగ టైగర్ నాగేశ్వర రావుని కలిశారట. ఎలా ఆమె టైగర్ నాగేశ్వరరావు లో మార్పు తీసుకువచ్చారు అనేది ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కూడా నటిస్తున్నారు.