Telugu News » Revanth Reddy : అసెంబ్లీలో కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్.. రేవంత్ రెడ్డినా మజాకా..!!

Revanth Reddy : అసెంబ్లీలో కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్.. రేవంత్ రెడ్డినా మజాకా..!!

కేసీఆర్ కు రాజకీయ అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.

by Venu

అప్పుల కుప్పగా మారిన రాష్టంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కత్తిమీద సాములా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు.. ఆ పార్టీ నేతల ఎదుగుదలకి మాత్రమే ఉపయోగపడ్డాయనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం ఈ అంశం పై వాదనలు మరో విధంగా వినిపిస్తుండటం కనిపిస్తోంది.

revanth-vs-ktr

ఇకపోతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ (Telangana) అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు ఉండేవని ఆరోపించారు.. మరోవైపు కేటీఆర్ విమర్శలకి.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ కు రాజకీయ అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. అదీగాక కేసీఆర్‌కు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని తెలిపిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో అసెంబ్లీకి వచ్చిన విషయాన్ని మరవడం.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటారని 6 mm బుల్లెట్ దించారు..

మా ప్రభుత్వానికి ఐదేళ్ల సమయం ఉందన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy)..బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన దోపిడిని లెక్కలతో సహా చెబుతామన్నారు. కొంత మంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్‌ (KTR)ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పడగానే ఫలితాల కోసం ప్రశ్నించడం ఆవివేకమని రేవంత్ రెడ్డి వెల్లడించారు..

You may also like

Leave a Comment