రేవంత్ రెడ్డి సీఎం అయ్యే బాధ్యతలని పూర్తి చేస్తున్నారు. కీలక పోస్టింగ్లకి నిజాయితీగల అధికారులను తీసుకుంటూ దుబారా ఖర్చుల జోలికి వెళ్లట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. సీఎం అయిన తర్వాత కూడా సొంత కారునే వాడుతున్నారు రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్ కొనుగోలు పట్ల ఆసక్తి చూపలేదు. బుల్లెట్ ప్రూఫ్ కారు కావాలని అధికారులు చెప్పడంతో తన కారుకే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయించుకున్నారు. కాన్వాయ్ లని తగ్గించాలని కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్లారు ఈ విషయం మనకి తెలుసు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ నుండి భోజనం పంపబడింది రేవంత్ ఇంట్లోని వంట మనిషి ఆయనకి ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఇలా అయితే నిన్ను పనిలో నుండి తీసేయాల్సి ఉంటుందని వంట మనిషికి వర్కింగ్ ఇచ్చారట రేవంత్ రెడ్డి తాను తన సొంత భోజనమే తింటానని ప్రోటోకాల్ వంటివి ఏమీ వద్దని ఎప్పటిలాగే వంట చేయమని వంట మనిషిని ఆదేశించారు.
Also read:
ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి నుండి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రగతి భవన్లో ఎందుకు ముందు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండగా దాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఇచ్చారు. అలానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పాత సంప్రదాయాన్ని మళ్లీ తెరమీదకి తీసుకువచ్చారు. జర్నలిస్టు తో చిట్ చాట్ చేయడానికి రేవంత్ రెడ్డి పాత విధానాన్ని మొదలుపెట్టారు.