ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టారు రేవంత్ రెడ్డి. అనుకోకుండా ఎవరు ఊహించలేని విధంగా ఎన్నికల ఫలితం వచ్చింది. కేసీఆర్ ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఓడించి ముఖ్యమంత్రిగా నిలిచారు ముక్కుసూటిగా ఉంటారు రేవంత్ రెడ్డి. గొప్ప నాయకుడు అని కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టారు రేవంత్ రెడ్డి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు నుండి కూడా రాజకీయాల్లోకి వచ్చారు రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకుల్ని కూడా ఎదుర్కొన్నారు.
ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి మనకు తెలుసు కానీ వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రేమ కథ గురించి కూడా చాలామందికి తెలియదు. ఆ ప్రేమ కథ కూడా సినిమాను తలపించే లెవెల్ లో ఉంది. రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీ లీడర్ గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాల్ని చేసేవారు. రేవంత్ రెడ్డి ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లినప్పుడు గీతారెడ్డి ని మొదటిసారి చూశారు మొదటి పరిచయంలోనే ప్రేమగా మారింది రేవంత్ రెడ్డి మొదట గీత రెడ్డికి ప్రపోజ్ చేశారు.
Also read:
రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఆమెకి నచ్చి ఒప్పుకున్నారు. గీతారెడ్డి రేవంత్ రెడ్డి ప్రేమని ఒప్పుకున్నాక పెద్దల్ని ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. మొదట్లో గీతారెడ్డి తండ్రి వీళ్ళ ప్రేమ విషయం తెలిసి ఒప్పుకోలేదు గీతారెడ్డిని పై చదువుల కోసం సోదరుడి మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించారు. అయినా సరే రేవంత్ రెడ్డి వదల్లేదు. జైపాల్ రెడ్డి తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. రేవంత్ రెడ్డి మొండితనం చూసి జైపాల్ రెడ్డి ఆయనని ఒప్పించారు. గీత రెడ్డి తండ్రి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు 1992లో వీళ్ళ పెళ్లి జరిగింది వీళ్ళకొక కూతురు కూడా ఉంది. గీత రెడ్డి రేవంత్ రెడ్డి కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా సహకారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు.