హైదరాబాద్ (Hyderabad) నగర అభివృద్ది కోసం నిర్విరామంగా కృషి చేస్తామని, ఇందులో భాగంగానే మెట్రో ఫేజ్-2 పనులను మొదలు పెట్టేందుకు ఈ నెల 8వ తేదీన శిలాఫలకం వేసుకుంటున్నామని తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్‌తో సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయన్నారు.
తెలంగాణలో సమస్యలను ప్రధానికి వివరించామన్నారు. ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు.. విదేశీ పర్యాటకులు హైదరాబాద్ ని సందర్శించకుంటే అది అసంపూర్తి పర్యటన అని అనుకునేలా నగరాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా అల్వాల్ (Alwal) లో పర్యటించిన సీఎం.. హైదరాబాద్- రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎటివేటర్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు..
ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కేటీఆర్ తన తండ్రిని స్పూర్తిగా తీసుకొని ఆమరణ నిరహార దీక్ష చెయ్యాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే నగరం అభివృద్ధి జరిగిందని తెలిపిన సీఎం.. గత పదేళ్లలో మాదక ద్రవ్యాలు, గంజాయి అడ్డాగా నగరాన్ని మార్చారని విమర్శించారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదం స్ఫూర్తిగా KTR సచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో నినాదంతో కేటీఆర్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తే సహకరిస్తామని ఎద్దేవా చేశారు.
మూసీ నది ప్రక్షాళన సహా నగరానికి నిధుల కోసం ధర్నా చేయాలని తమ కార్యకర్తలే కేటీఆర్‌కు కంచె వేసి కాపాడతారని రేవంత్ పేర్కొన్నారు. మరోవైపు కేటీఆర్.. మా కృషి ఫలించిందని, మేం పోరాటం చేశాం, రేవంత్ రెడ్డి సాధించాడని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తెచ్చింది మేము అయితే అందులో తన కృషి ఎంటోనని ప్రశ్నించారు. ఆయన ఏం పోరాటం చేశాడో చెప్పాలని, ట్విట్టర్ లో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే తన పోరాటమని సెటైర్లు వేశారు..