ఆర్టీసీ బస్సు(RTC Bus) ఆటో(Auto)ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదం ఖమ్మం- సూర్యాపేట(Khammam- Suryapet) 365 జాతీయ రహదారి(National Highway)పై చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల(Munagala) మండలం రామసముద్ర(Ramasamudra) గ్రామానికి చెందిన 12మంది కూలీలు ఆటోలో మోతె నుంచి హుస్సేన్ బాద్ గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో తిరుపతమ్మ తల్లి ఆలయం దగ్గరలోని అండర్ పాస్ క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో దీంతో ముగ్గురు మహిళలు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందగా ఆటోలో ఉన్న మిగతా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే స్థానిక సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై యోగవేందర్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూలీ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారని పోలీసులు తెలిపారు.