Telugu News » RBI: రూ. 2 వేల నోట్ల మార్పిడికి నేటితో ముగియనున్న గడువు…..!

RBI: రూ. 2 వేల నోట్ల మార్పిడికి నేటితో ముగియనున్న గడువు…..!

కేవలం ఆర్బీఐ బ్యాంకుల్లో మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

by Ramu

బ్యాంకు(Banks)ల్లో 2 వేల రూపాయల నోట్ల (Two Thousand Rupees NOtes) మార్పిడికి నేటితో గడువు ముగియనున్నట్టు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. నేటితో గడువు ముగిసినప్పటికీ రేపటి నుంచి రూ. 2 వేల నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే వాటిని కేవలం ఆర్బీఐ బ్యాంకుల్లో మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

Rs 2000 notes will not be able to be exchanged in banks after today

రేపటి నుంచి రూ. 2 వేల నోట్లను కేవలం ఆర్బీఐలోని 19 కార్యాలయాల్లో మాత్రమే మార్పిడికి అనుమతించనున్నారు. ఒక ట్రాన్సక్షన్ కు గరిష్టంగా రూ. 20వేలు విలువ చేసే నోట్లను మాత్రమే డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ అనుమతిస్తోంది. ప్రస్తుతం ప్రజలు రూ. 2 వేల నోట్లను తమ ఏదైనా బ్యాంకు అకౌంట్‌ లో క్రెడిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది.

ఇక ఇప్పటి వరకు రూ. 2 వేల నోట్లలో 90 శాతం వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మొత్తం రూ. 3.43 లక్షల కోట్లు విలువ చేసే రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చినట్టు పేర్కొంది. ఇంకా రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని తెలిపింది.

రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మేలో ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2వేల నోట్ల మార్పిడికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు మొదట గడువుగా నిర్ణయించింది. ఆ తర్వాత తుది గడువును అక్టోబర్ 7కు పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.

You may also like

Leave a Comment