Telugu News » TSPSC : పరీక్షలు కాదు, టీఎస్పీఎస్సీని రద్దు చేయండి

TSPSC : పరీక్షలు కాదు, టీఎస్పీఎస్సీని రద్దు చేయండి

ఈ పరీక్ష రాసిన వారి నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జూలైలో కీ విడుదల అయింది. అయితే తాజా హైకోర్ట్ ఆదేశాలతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది.

by Prasanna
praveen kumar

తెలంగాణ గ్రూప్ వన్ (Group-1) ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఈ పరీక్ష రద్దవడం ఇది వరుసగా రెండోసారి. గత ఏడాది పరీక్ష (Exam) జరిగిన తర్వాత పేపర్ లీకేజీ (Paper leakage) వ్యవహారం బయటకు రావడంతో మొదటిసారి గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయగా, మళ్లీ 2023 జూన్ నెలలో ఈ ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈసారి సుమారు 2 లక్షల 30 వేల మంది రాయగా, మొత్తం పోస్టులు 503. ఈ పరీక్ష రాసిన వారి నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జూలైలో కీ విడుదల అయింది. అయితే తాజా హైకోర్ట్ ఆదేశాలతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది.

praveen kumar

పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత రెండోసారి పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సరిగ్గా సేకరించలేదని కాబట్టి ఈ పరీక్ష చెల్లదని, రద్దు చేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు టీఎస్పీఎస్సీకి నోటీసులు ఇచ్చి కేసు విచారణ జరిపింది. ఇవాళ తీర్పు ఇస్తూ జూన్ 11న జరిగిన ఈ పరీక్ష చెల్లదని, మళ్లీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండో సారి రద్దు కావడానికి సీఎం కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలనే కారణమన్నారు. టీఎస్పీఎస్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేసి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ పరీస్థితి వచ్చేది కాదన్నారు. నిరుద్యోగుల అభ్యర్థనను మన్నించి వారి పక్షాన నిలబడ్డ న్యాయవ్యవస్థకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

టీఎస్పీఎస్సీ కమీషన్ సభ్యులంతా అర్జంటుగా రాజీనామా చేసి, కమీషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించిన తరువాతనే మిగతా పరీక్షలను నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసును CBI కు అర్జంటుగా అప్పగించడంతో పాటు పరీక్ష రాసిన అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. నవంబర్ లో జరగనున్న గ్రూప్-2తో సహా మిగతా పరీక్షలన్నీ కొత్త కమీషన్ హాయాంలోనే జరగాలి, గ్రూప్ పరీక్షల కుంభకోణంలో తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్ పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలన్నారు.

నిరుద్యోగులు నిరాశపడవద్దని, బహుజన రాజ్యంలో పరీక్షలు పారదర్శకంగా, నిజాయితీగా  నిర్వహించుకుందామని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

 

 

 

 

 

 

 

You may also like

Leave a Comment