Telugu News » Russian: రష్యా అధ్యక్షుడు పుతిన్ కి గుండెపోటు.. నిజమా.. !?

Russian: రష్యా అధ్యక్షుడు పుతిన్ కి గుండెపోటు.. నిజమా.. !?

పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించింది. జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన ఒక సాధారణ బ్రీఫింగ్ సందర్భంగా క్రెమ్లిన్ (kremlin) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్.. అధ్యక్షుడు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తున్నారనే వాదనలను ఖండించారు. దీన్నో బూటకపు ప్రచారంగా ఆయన తోసిపుచ్చారు.

by Venu

రష్యా అధ్యక్షుడు (Russian President) పుతిన్ (Putin)కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్టు నిన్నటి నుంచి మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. అయినా ఈ మధ్య పుతిన్ ఆరోగ్యం (Health)పై పుకార్లు వరుసగా వ్యాపిస్తున్నాయి. కాగా సంచలనంగా మారిన ఈ వార్త రష్యన్లతో పాటు అంతర్జాతీయంగా కూడా ఆందోళనకి బీజం వేసింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఈ పుకార్ల పై స్పందించింది.

పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారని ధృవీకరించింది. జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన ఒక సాధారణ బ్రీఫింగ్ సందర్భంగా క్రెమ్లిన్ (kremlin) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్.. అధ్యక్షుడు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తున్నారనే వాదనలను ఖండించారు. దీన్నో బూటకపు ప్రచారంగా ఆయన తోసిపుచ్చారు. మరోవైపు 2022 నుండి పుతిన్ క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో పాటు మరిన్ని వ్యాధులతో బాధపడుతున్నట్టు తెగ ప్రచారం జరిగింది..

అయితే పుతిన్ బహిరంగంగా నీరసంగా కనబడటం.. ఆయన శరీరం ఉబ్బినట్టుగా కనిపించడం కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే రష్యా ప్రభుత్వం ఈ వార్తల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా గుండెపోటు పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని కూడా క్రెమ్లిన్ తోసిపుచ్చడంతో ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది.

ఇదే సమయంలో పుతిన్‌ తనలాంటి మరో వ్యక్తిని డూప్‌గా ఉపయోగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ( Dmitry Peskov) స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలే అని కొట్టిపారేశారు. కాగా ప్రస్తుతం ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్దంపై దృష్టి పెట్టిన పుతిన్.. ఆ వ్యూహాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

You may also like

Leave a Comment