భారత్- అమెరికా సంబంధాలకు పరిమితులు విధించడం చాలా కష్టమైన పని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jai Shankar) అన్నారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అభిలషణీయమైన, అనుకూలమైన, అత్యంత సౌకర్యమైన భాగస్వామ్యం ఉందని ఆయన వెల్లడించారు. అందరి అంచనాల (Expectations)ను మించి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడిపోయాయన్నారు.
వాషింగ్టన్‌లో నిర్వహించిన ‘కలర్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఇప్పుడు అన్ని విధాలుగా అంచనాలకు మించి భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడ్డాయన్నారు. ఇప్పుడు ఇరు దేశాల మద్య సంబంధాలను గురించి నిర్విచించేందుకు కూడా మనం ప్రయత్నం చేయలేమన్నారు.
1985లో రాజీవ్ గాంధీ అమెరికాలో పర్యటించారన్నారు. ప్రజలు ఇప్పటికీ ఆ పర్యటనను గుర్తు చేసుకుంటారన్నారు. ఆ సమయంలో తాను ఇక్కడే వున్నానన్నారు. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అగ్రరాజ్యంలో పర్యటించారని గుర్తు చేశారు. అప్పుడే న్యూక్లియర్ డీల్ జరిగిందన్నారు. ఆ సమయంలో కూడా తాను ఇక్కడే వున్నానని చెప్పారు.
ప్రధాని మోడీ కూడా అమెరికా పర్యటనను కూడా అందరు గుర్తుకు తెచ్చుకుంటారని అన్నారు. ఆ సమమంలొనూ తాను ఇక్కడే వున్నానన్నారు. అయితే మిగతా పర్యటనలతో పోలిస్తే ఇది భిన్నమైనదన్నారు. గత ప్రధానుల హయాంలో భారత్- అమెరికాలు ఒప్పందాలు చేసుకునే వన్నారు. కానీ ఇప్పుడు భారత్- అమెరికాలు కలిసి పని చేస్తున్నాయని వెల్లడించారు.