భారత్ -మాల్దీవులు (India-Maldives) మధ్య క్షీణిస్తున్న దౌత్య సంబంధాల పై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar)తాజాగా స్పందించారు. రాజకీయాను రాజకీయంగానే చూడాలని అన్నారు. ప్రతి దేశమూ ఎల్లప్పుడు భారత్ కు మద్దతు ఇస్తుందనే గ్యారెంటీ ఏదీ లేదని వెల్లడించారు.
నాగ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ…. గత పదేండ్లుగా పొరుగు దేశాలతో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. ఇలాంటి వ్యూహాం మారుతున్న రాజకీయాలతో విదేశీ ప్రజలు భారత్ పట్ల మంచి భావం కలిగి ఉండేలా చూస్తుందని తెలిపారు.
రాజకీయాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పారు. కానీ ఆయా దేశాల ప్రజలు భారత్ పట్ల సానకూల భావాలను కలిగి ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఈ రోజు రోడ్లు నిర్మించడం, విద్యుత్తు, ఇంధనాన్ని సరఫరా చేయడం, వాణిజ్య సదుపాయం కల్పించడం, పెట్టుబడులు పెట్టడం, ఇతర దేశాల్లో పర్యటించేందుకు ప్రజలను అనుమతించామన్నారు.
ఇది ఇలా వుంటే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తమది భౌగోలికంగా చాలా చిన్న దేశమని చెప్పారు. కానీ తమను బెదిరించడం తగదని చెప్పారు. మాల్దీవుల విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా తాము గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా వెల్లడించింది.