కేరళ(Kerala)లోని బంగారు కోవెల.. శబరిమల అయ్యప్ప స్వామి(Shabarimala ayyappa swami) ఆలయాన్ని గురువారం సాయంత్రం తెరిచారు. ఏటా అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండు నెలల పాటు భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈసారి అయ్యప్ప ఆలయం భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు సరికొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బంగారు కోవెల ముఖ ద్వారం దగ్గర కొత్తగా రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. వాటిపై స్వామియే శరణం అయ్యప్ప అని రాశారు. ఆలయ ముఖ ద్వారం దగ్గర హైడ్రాలిక్ రూఫ్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. చెన్నైకి చెందిన ఓ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ దీన్ని డిజైన్ చేసింది.
ఈ శిలలు భక్తులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ శిలలపై అందమైన కళాకృతులు కట్టిపడేస్తున్నాయి. ఆలయంలోని 18 బంగారు మెట్లు ఉండే పదినిట్టం పాడిపై ఈ రూఫ్ ఏర్పాటు చేశారు. వర్షం లేని సమయంలో ఆ రూఫ్‌ను తీసేయవచ్చు. డిసెంబర్ 27న మండల దీక్ష సీజన్ ముగియనుంది.
అప్పుడు శబరిమల ఆలయాన్ని మూసివేసి.. తిరిగి మకర సంక్రమణ రోజైన డిసెంబర్ 30న ఆలయాన్ని తెరువనున్నారు. జనవరి 15న అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. మరోవైపు, శబరిమల ఆలయానికి వెళ్లే.. భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.