వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు (Chandra Babu) కుట్ర ఉందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. షర్మిల వల్ల ఏపీలో వైఎస్ఆర్ సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉందని స్పష్టం చేశారు. రాజకీయంగా ఆమె ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని చెప్పారు. ప్రజలా? కుటుంబమా అనే ప్రశ్న వస్తే ప్రజలే తమ ఛాయిస్ అని సీఎం జగన్ చెబుతారన్నారు.
రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదని చెబతూనే మళ్లీ ఇప్పుడు ఈ వాదన ఎందుకు తీసుకు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సీఎం రమేశ్ కు సంబంధించిన విమానంలో షర్మిల, బ్రదర్ అనిల్ వెళ్లారని చెప్పారు. విమానాశ్రయంలో బ్రదర్ అనిల్‌తో బీటెక్ రవి భేటీ అయ్యారని పేర్కొన్నారు.
సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్ కుటుంబం కోసం పార్టీ పెట్టలేదని తెలిపారు. తమ విధానాలు తమకు ఉన్నాయని.. పార్టీ వీడటానికి కారణం వాళ్ళే చెప్పారన్నారు. ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుందని సజ్జల తెలిపారు.
గతంలో బ్రదర్ అనిల్ పై టీడీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేశారో చూశామన్నారు. కానీ ఇప్పుడు అదే అనిల్ తో టీడీపీ నేతలు ఫోటోలు దిగుతున్నారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇది టీడీపీ నేతల పన్నాగమని తెలుస్తోందన్నారు. అటు టీడీపీ నేత లోకేశ్ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. లోకేశ్ తాతను చంపింది ఎవరు అని ప్రశ్నించారు.
బాలింతలు, పసి పిల్లలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోవాలని టీడీపీ చెబుతోందా? అని నిలదీశారు. ఎస్మా అంటే అత్యవసర సేవలు అన్న విషయం లోకేష్ కు తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా వుంటే అంగన్వాడీలు సమ్మె మొదలు పెట్టి నెల రోజులు దాటిందన్నారు. అయినా వారిని అలా వదిలేయాలా? అని ప్రశ్నలు గుప్పించారు.
కుటుంబం కోసం జగన్ పార్టీ పెట్టలేదన్నారు. తమ విధానాలు తమకు ఉన్నాయని వివరించారు. పార్టీ వీడటానికి కారణం వాళ్ళే చెప్పారని గుర్తు చేశారు. ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుందన్నారు. వీలైనంత వరకు గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. టికెట్ ఇవ్వటమే కిరీటం కాదని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో మార్పులు ఏ పార్టీలో అయినా అంతర్గతంగా జరిగాల్సిన కసరత్తు అని చెప్పుకొచ్చారు.