హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పెద్ద హిట్ కొట్టేసి తర్వాత నుండి కూడా పెద్దగా సినిమాలు హిట్ కాలేదు. గత ఏడేళ్లలో ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే మూవీ అయితే రాలేదు బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ సినిమా ప్రభాస్ కి అసలు రాలేదు. 2017లో బాహుబలి 2 వచ్చింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ని షాక్ చేసింది ఆ సినిమా రికార్డ్స్ ఇప్పటికీ కూడా చెక్కుచెదరకుండానే ఉన్నాయి. రెండు ఏళ్ళ కి 2019లో సాహో రిలీజ్ చేశారు.
కానీ సినిమా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. హిందీ వర్షన్ మాత్రం విజయం సాధించింది. రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలు మాత్రం బాగా నిరాశపరచాయి. బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలని చూసింది. వందల కోట్ల నష్టాన్ని తీసుకువచ్చాయి. ఈ చిత్రాల దర్శకులని ప్రభాస్ ఫ్యాన్స్ బాగా తిడుతున్నారు. ప్రభాస్ నుండి భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ వస్తే చూడాలని సినిమా హిట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నారు.
Also read:
సలార్ ట్రైలర్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది సినిమా ఎలా ఉంది అనే దాని గురించి ప్రస్తుతం ఒక వార్త వచ్చింది. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందట. సినిమా మొదలైన అరగంట వరకు కూడా ప్రభాస్ ఉండడు. సలార్ ఫస్ట్ సింగిల్ సూరుడే విడుదల తర్వాత ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఈ సినిమా అద్భుతంగా ఉందట. సిల్వర్ స్క్రీన్ పై పక్కా మాస్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఎమోషన్స్, కథ అన్నీ కూడా అదిరిపోయాయని టాక్ అయితే వస్తోంది. డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.