Telugu News » Samantha : ఆనందం వచ్చినా… బాధ కలిగినా అలా చేసేదాన్ని…. సమంత ఎమోషనల్ పోస్టు….!

Samantha : ఆనందం వచ్చినా… బాధ కలిగినా అలా చేసేదాన్ని…. సమంత ఎమోషనల్ పోస్టు….!

టాలీవుడ్ (Tollywood) బ్యూటీ సమంత (Samantha) ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగారు.

by Ramu
samantha emotional heroine samantha visits famous sound of music movie locations in australia

టాలీవుడ్ (Tollywood) బ్యూటీ సమంత (Samantha) ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగారు. స్టార్ హీరోలతో నటించి మంచి హిట్స్ అందుకున్నారు. చేతి నిండా సినిమాలతో ప్రొఫేషనల్ లైఫ్ లో బిజి బిజీగా గడిపారు.

samantha emotional heroine samantha visits famous sound of music movie locations in australia

కానీ ఇటీవల ఈ భామ తన సినీ కెరీర్ కు కాస్త బ్రేక్ ఇచ్చి పర్సనల్ లైఫ్‌‌పై ఫోకస్ పెట్టింది. అన్ని సమస్యలను పక్కకు పెట్టి ట్రావెలింగ్ లో బిజీగా గడుపుతోంది.

samantha emotional heroine samantha visits famous sound of music movie locations in australia

చిన్న తనం నుంచి ఎన్నో ప్రదేశాలను చూడాలని అనుకున్నారు. కానీ స్కూల్ లైఫ్, ఆ తర్వాత ప్రొఫెనల్ లైఫ్ వల్ల ఆమె ఆ ప్రదేశాలను చూడ లేకపోయారు. కానీ ఇప్పుడు కాస్త బ్రేక్ దొరకడంతో ఆ సమయాన్ని తన చిన్న నాటి ఆకాంక్షలను నెరవేర్చుకునే పనిలో పడ్డారు సామ్.

తాజాగా అమ్మడు ఆస్ట్రియాలో ఆనందంగా గడిపారు. సాల్ బర్గ్ లోని తనకు ఎంతో ఇష్టమైన లొకేషన్స్ లో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. తనకు ఎప్పుడైనా ఆనందం కలిగినా లేదా బాధ కలిగినా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రాన్ని చూడటం తనకు చిన్నప్పటి నుంచి అలవాటన్నారు.

ఆ చిత్రాన్ని చూస్తూ ఈ ప్రపంచం నుంచి తప్పించుకునేదాన్ని అని చెప్పారు. ఆ చిత్రాలు తనను వాస్తవ ప్రపంచానికి దూరంగా తనను తీసుకు వెళ్లేదన్నారు. అది తనకు ఒక ఆధ్మాత్మిక ప్రదేశమన్నారు.

ఇటీవల సమంత మయోసైటిస్ బారిన పడ్డారు. కొంత కాలంగా ఇమ్యూనిటీ డిజాస్టర్ ఇబ్బంది పడుతున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత తన గత ప్రాజెక్టులన్నింటినీ ఆమె పూర్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రొఫెనల్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు.

 

You may also like

Leave a Comment