స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటిస్ అనే అరుదైన (myositis diagnosis) వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటోంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటోంది.
ఈ మధ్య వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సిటాడెల్ ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్‌తో మంచి ఫ్రెండ్ షిప్ మెయింటేన్ చేస్తుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫ్రెండ్స్‌తో ఎక్కువగా గడుపుతోంది.
వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, చిన్మయితో ఆమెకున్న బంధం అందరికీ తెలిసిందే. చిన్మయి భర్త రాహుల్‌ను తాను ఎంత నమ్ముతుందో చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సమంత రాహుల్ గురించి చాలా పాజిటివ్‌గా చెప్పింది. చిన్మయి హోస్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్ కు అటెండ్ అయిన సామ్ ఆమె చూపించిన గ్రూప్ ఫొటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
ఇందులో వెన్నెల కిశోర్, రాహుల్ తో పాటు వీరిద్దరూ ఉన్నారు. ఈ పిక్ గురించి వివరిస్తూ ‘ నేను నా జీవితంలో ఎక్కువగా నమ్మే వ్యక్తి రాహుల్. మర్డర్ చేసినా తనతో చెప్పేస్తా.. ఎందుకంటే అతడు నన్ను జడ్జ్ చేయడు. చాలా జెన్యూన్‌గా ఉంటాడు. రాహుల్‌తో నా బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.