హిందూ మతంలో ముఖ్యమైన దేవతా మూర్తిగా కొలిచేవారిలో చదువుల తల్లి సరస్వతి దేవి (Saraswati Devi) ఒకరు.. ఈ తల్లి అనుగ్రహం వల్లే మనుషులు మాట్లాడగలుగుతున్నారని నమ్మకం.. అదీగాక ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. మనిషికి, మాట ఆ సరస్వతీ దేవి ఇచ్చిన వరం అనే భావన హిందువుల్లో బలంగా ఉంది. ఇక చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం ఉంటేనే చదువుల్లో (Studies) రానిస్తారని పండితులు చెబుతారు.
అందుకే ప్రతి పాఠశాలలోను సరస్వతి దేవి విగ్రహాలు ఉంటాయని అంటున్నారు. కాగా ఎంత కష్టపడి చదివినా ఫలితం ఉండటం లేదని బాధపడేవారు సరస్వతి దేవిని భక్తితో పూజిస్తే (Puja) అత్యున్నత ర్యాంకులు సాధిస్తారని పండితులు (Scholars) వెల్లడిస్తున్నారు. అయితే అమ్మవారికి ఎలా పూజలు చేస్తే ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
విద్యార్ధులచే విద్యా దేవతగా ఆరాధించబడుతున్న సరస్వతి పూజను చేయాలనుకున్న రోజు.. తెలుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి పసుపు రంగు పుష్పాలను (Yellow flowers)..లేదా బంతి, చామంతి పూలతో పూజించడం ఉత్తమం అని వారు అంటున్నారు. ప్రసాదంగా.. కేసరి, కుంకుమపువ్వు, లడ్డూ, హల్వా, కిచిడీ, పాయసం వంటివి సమర్పించవచ్చని పండితులు వెల్లడిస్తున్నారు. కాగా సరస్వతీ దేవికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారి పూజను నిర్వహించుకోవాలని తెలుపుతున్నారు.
మరోవైపు ఈ పూజ ఎప్పుడు చేసినా సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు నిర్వహించుకోవడం మంచిదని పండితులు, జ్యోతిష్య నిపుణలు చెప్తున్నారు.. 108 బిందెల నీటితో అభిషేకం చేస్తే అమ్మవారు సంతోషించి వాక్ శక్తిని ప్రసాదిస్తారని తెలుపుతున్నారు. అలాగే లేని వారికి మీకు తోచిన విధంగా పుస్తకాలు దానం చేయడం ద్వారా కూడా అమ్మవారి కటాక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు..