Telugu News » అగ్నికణం.. వీర సావర్కర్ ‘

అగ్నికణం.. వీర సావర్కర్ ‘

భారత స్వాతంత్య్ర చరిత్రలో రెండు ఆజన్మ కారాగార శిక్షలు అనుభవించిన ఏకైక వ్యక్తి అంటేనే బ్రిటీష్ వారిపై ఈయన పోరాటాలు ఎలా ఉండేవే అర్థం చేసుకోండి.

by Ramu

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌.. ఈ పేరులోనే వీరత్వం ఉట్టిపడుతుంది. పాఠశాలలో చదివే రోజుల్లోనే ‘మిత్ర మేళా’తో పోరాట పాఠాలు నేర్చిన గొప్ప పోరాట యోధుడు ఈయన. వందలాది మంది యువతను స్వాతంత్య్ర పోరాటం వైపు మళ్లించి విప్లవ వీరులుగా మార్చిన ఘనత ఈయనకే దక్కుతుంది. భారత స్వాతంత్య్ర చరిత్రలో రెండు ఆజన్మ కారాగార శిక్షలు అనుభవించిన ఏకైక వ్యక్తి అంటేనే బ్రిటీష్ వారిపై ఈయన పోరాటాలు ఎలా ఉండేవే అర్థం చేసుకోండి.

savrkar the great patriot

 

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్, రాధాబాయి దంపతుల కుమారుడే వినాయక్ దామోదర్ సావర్కర్. నాసిక్ లో విద్యాబ్యాసం అనంతరం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు. ఆ తర్వాత అనేక పుస్తకాల ద్వారా ప్రజలను స్వాతంత్రోద్యమం వైపు పురిగొల్పారు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ కు న్యాయస్థానం అండమాన్‌ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది.

న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటించగానే. ‘బ్రిటిష్‌ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి సావర్కర్‌. అంతేకాదు, ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు. హిందూత్వ పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్‌ గుర్తుకు వస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.

‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పిత భూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మ తాః’
‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది. హిందూత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వచించారు సావర్కర్‌. హిందూ సంఘటన అంటే జాతి సంరక్షణ అని చెప్పారు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని కొనసాగించారు.

You may also like

Leave a Comment