నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. ఎన్టీఆర్ గారు అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో కూడా బిజీగా ఉండేవారు. పైగా పౌరాణిక పాత్రలు చేయడంలో ఎన్టీఆర్ కి పెట్టింది పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హీరో ఎన్టీఆర్ ఏ అని ఇంకా ఎంతో మంది అంటూ ఉంటారు. ఆయన సినిమాలో ఉన్నంత కాలం కూడా స్వర్గయుగంలా ఉండేదని అనేవారు. సినిమాల్లో ఎన్టీఆర్ స్పెషల్ గా ఉండేవారు.
ఆయనని ఆదర్శంగా తీసుకుని, ఇండస్ట్రీ కి చాలా మంది వచ్చారు. అలానే ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడాప్రతి పనిని కూడా టైం కి చేసేసేవారట. అయితే ఏ పనులు లో ఎంత బిజీగా ఉన్నా ఆహారపు అలవాట్లలో మాత్రం తేడా రాకుండా ఎన్టీఆర్ చూసుకునేవారు. సరైన భోజనం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటానని ఎన్టీఆర్ ఫాలో అయ్యే వారు. కచ్చితంగా ఎన్టీఆర్ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండేవారట. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారు.
Also read:
తర్వాత బ్రేక్ఫాస్ట్ తినే వారు బ్రేక్ఫాస్ట్ లో 24 ఇడ్లీలు ఎన్టీఆర్ తినేవారట. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు తినడం అవ్వకపోతే భోజనం తినేసేవారట. కచ్చితంగా మాంసం ఉండేలా చూసుకునేవారు. ఎన్టీఆర్ ఎక్కువగా నాన్ వెజ్ తినేవారు అని తోటి నటులు కూడా చెప్తూ ఉంటారు. అలానే ఆయన ప్రతి రోజు రెండు లీటర్లు బాదం పాలు కూడా తాగేవారట. చెన్నైలో ఉంటున్నప్పుడు బజ్జీలు తినడానికి బాగా ఇష్టపడేవారు. అప్పుడు ఏకంగా 30 నుండి 40 బజ్జీలు తినేసేవారట.