తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెలలు గడిచాక, బీఆర్ఎస్ (BRS) ఓటమిపై ఒక్కొక్కరు పెదవి విప్పుతున్నారు.. జరగవలసిన నష్టం జరిగాక.. పార్టీ అపజయంపై సమీక్షలు నిర్వహించుకొంటున్నారు.. ఇప్పటికే కవిత (Kavitha).. కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతోన్న విషయం తెలిసిందే.. ఒకవేళ గెలిస్తే.. ఆ లెక్క కేసీఆర్, కేటీఆర్ అకౌంట్లో.. ఓటమి నిందలు మాత్రం ఎమ్మెల్యేల ఖాతాలో జమచేయడం సరికాదనే విమర్శలు సైతం మొదలైయ్యాయి.
కానీ ఇక్కడ జనం కేఆసీఆర్ (KCR)ని, సంక్షేమాన్ని చూసి ఓట్లు వేస్తారనే గొప్పలు చెప్పిన మాస్టర్.. ప్రస్తుతం ఈ విషయం మరచినట్టు ఉన్నారని అనుకొంటున్నారు.. ఇక తాజాగా గులాబీ ఓటమిపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra)సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం కూర్చున్న చెట్టు కొమ్మను మనమే నరుక్కున్నామని అభిప్రాయపడ్డారు.
నేడు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలైనప్పుడే చర్యలు చేపట్టి.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఇందాక వచ్చేది కాదన్నారు.. ఒక ఎమ్మెల్యే ఓడిపోతే ఏం కాదు అనే భావనతో ఉండి.. పార్టీ నష్ట పోయేదాక ఆగడం.. జనంలో వ్యతిరేకత ఏర్పడకుండా చేయడంలో విఫలం అయ్యినట్టు అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో మొట్ట మొదటి సారిగా రెండు నియోజకవర్గాల ఇంచార్జిగా ఉన్నాను. కొత్తగూడెం ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నా.. కానీ జనం నాడి తెలుసుకోలేక పోయాం అని అన్నారు. మరోవైపు రాజకీయాలతో సంబంధం లేని వారు రాష్ట్రంలో 38 మంది గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.. పార్లమెంట్లో తెలంగాణ సమ్యసల కోసం కొట్లాడే ఏకైక వ్యక్తి నామ నాగేశ్వరావు అని తెలిపిన రవిచంద్ర.. నామా నాగేశ్వరావుకే ఎంపీ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.