Telugu News » HISTORY : షహీద్ శివ్ దేవి వీరత్వాన్ని పునికిపుచ్చుకున్న తన 14 ఏళ్ల సోదరి.. బ్రిటీష్ వారికి ఎదురెళ్లి..!

HISTORY : షహీద్ శివ్ దేవి వీరత్వాన్ని పునికిపుచ్చుకున్న తన 14 ఏళ్ల సోదరి.. బ్రిటీష్ వారికి ఎదురెళ్లి..!

భారత భూభాగంపై జన్మించిన వారికి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. మన పూర్వీకుల చరిత్ర నెమరేసుకుంటే చాలు. నెత్తురు మరిగిపోతుంటుంది. యుద్ధం నైపుణ్యాలు తెలియక పోయిన శత్రువ మీదకు కత్తి దూసేంత సాహసం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరీ సొంతం.

by Sai
Shaheed Shiv Devi's 14-year-old sister who revived her heroism.

భారత భూభాగంపై జన్మించిన వారికి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. మన పూర్వీకుల చరిత్ర నెమరేసుకుంటే చాలు. నెత్తురు మరిగిపోతుంటుంది. యుద్ధం నైపుణ్యాలు తెలియక పోయిన శత్రువు మీదకు కత్తి దూసేంత సాహసం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరీ సొంతం. దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక్కొక్కరు ఒక్కో హీరోనే. వారికి యుద్ధ నైపుణ్యాలు తెలీవు. కానీ ప్రకృతి, గురువులు నేర్పిన పాఠాలను జ్ఞప్తికి తెచ్చుకుని శత్రువులతో వీరోచిత పోరాటం చేసి మాతృభూమి బానిస సంకెళ్లు తెంచడం కోసం నెత్తుటి తర్పణం చేశారు.

Shaheed Shiv Devi's 14-year-old sister who revived her heroism.

32 మంది జాట్ ఉద్యమకారులను బ్రిటీష్ వారు దారుణంగా ఉరివేసి చంపితే వారి మరణాన్ని కళ్లారా చూసిన ఓ 16 ఏళ్ల బాలిక నిప్పు కనికలా మారి ఏకంగా 17 మంది బ్రిటీష్ సైనికులను ఊచకోత కోసింది.ఆమె మరెవరో కాదు ‘షహీద్ శివ్ దేవితోమర్’(Shaheed shivdevi tomar).. శివ్ దేవి మరణం కూడా ఆమె 14 ఏళ్ల సోదరిని బ్రిటీష్ వారిపై పగ తీర్చుకోవడానికి ఉసిగొల్పింది. ఆమె పేరు వీరంగన ‘షహీద్ జై దేవి తోమర్’(Shaheed jai devi tomar).

తన సోదరి షహీద్ శివ్ దేవి తోమర్ బలిదానానికి ప్రతీకారం తీర్చుకున్న భారతమాత కన్న మరో ముద్దుబిడ్డ. తన సోదరి మరణాంతరం బ్రిటీష్ వారి మీద పగ తీర్చుకుంటానని జై దేవి తోమర్ ప్రతిజ్ఞ చేసింది.దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులను స్వాతంత్ర్యం కోసం ప్రేరేపించింది. వారందరినీ సమీకరించి ఓ గ్రూపుగా తయారుచేసింది. లక్నోకు వెళుతున్న బ్రిటీష్ దళాలను అంతమొందించేందుకు ప్రణాళికలు రచించింది. మీరట్, బులంద్‌షహర్, అలీఘర్, మెయిన్‌పురి, ఇటావా వంటి ప్రాంతాల్లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఎంతో మంది జై దేవితో కలిశారు.

లక్నోలో బ్రిటీష్ దళాలను వెతుక్కుంటూ వెళ్లిన జై దేవీ బృందం వారి జాడను కనుగొన లేకపోయింది. తగినంత ఆహారం లేకపోయిన వారంతా రోజుల వ్యవధిలో బ్రిటీష్ వారికోసం వెతకసాగారు. చివరికి ఈ బృందం బ్రిటిష్ దళాలను గుర్తించింది. షహీద్ జై దేవి తోమర్ ఓ బ్రిటీష్ అధికారిని చంపగా, ఆమె బృందంలోని సభ్యులు బ్రిటిష్ సైనికులపై భీకర దాడికి దిగారు. బ్రిటిష్ వారు నివసించే బంగ్లాకు నిప్పంటించారు.ఈ ఘటనలో చాలా మంది బ్రిటీష్ సైనికులు మరణించారు.

అనంతరం లక్నోలో జరిగిన యుద్ధంలో బ్రిటీష్ సైనికుల చేతిలో తన సోదరి వలే షహీద్ జై దేవి తోమర్ కూడా వీరమరణం పొందింది. అనంతరం ఆమె బాడీని స్థానికులు దహనం చేశారు. సాధారణంగా 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల వద్ద ఉంటూ బడికి పోతుంటుంది. ఇంట్లో తల్లికి సాయం చేస్తూ ఉంటుంది. కానీ, 14 ఏళ్ల జై దేవి తోమర్ తనలోని వీరత్వాన్ని ప్రపంచానికి చూపించింది. ఏకంగా బ్రిటీష్ వారితో పోరాడి తన సోదరి మరణానికి ప్రతీకారం తీర్చుకుని చిన్న వయసులోనే మరణాన్ని ముద్దాడింది.

ఇద్దరు వీరవనితలు. భారత మాత కన్న ముద్దుబిడ్డల వీరత్వాన్ని గురించి మన చరిత్రకారులు వారి కోసం కనీసం ఒక పేజీని కేటాయించలేకపోయారంటే భవిష్యత్ తరాలకు వారు ఎంత గొప్పటి సాయం చేశారో ఇట్టే అర్థం అవుతుంది. మొగల్స్, సుల్తానులు, గ్రీకులు, బ్రిటీషర్స్ వీరత్వాన్ని, క్రూరత్వానికి మనదేశంలోని చరిత్ర పుటల్లో పేజీలు కేటాయించారు.కానీ ఈ దేశంలో పుట్టి, మాతృభూమి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారికి చరిత్రలో చోటు కల్పించలేకపోయారు మన విశ్వాస ఘాతకులైన చరిత్రకారులు.

షహీద్ శివ్ దేవి తోమర్, షహీద్ జై దేవి తోమర్ జీవిత చరిత్ర, వీరత్వం గురించి నేటితరం మహిళలు, యువతులు తెలుసుకుని ఉంటే మనదేశంలో నిర్భయ లాంటి ఘటనలు బహుశా జరగకపోయి ఉండచ్చు. క్రూరమైన మనస్వత్త్వం కలిగిన వారితో పోరాడే తత్త్వాన్ని ఎంతో కొంత నేర్చుకుని ఉండేవారు.కఠిన మైన పరిస్థితుల్లో వారిని వారు ఎలా కాపాడుకోవాలో శివ్ దేవి సిస్టర్స్ జీవిత చరిత్ర చదివిన వారిలో కనీసం ఒక్కరైనా చెడు మీద యుద్ధం ప్రకటించేవారని కచ్చితంగా చెప్పగలం.

 

 

You may also like

Leave a Comment