Telugu News » Shivasena: శివసేన తొలిజాబితా విడుదల.. లోక్ సభ అభ్యర్థులు వీరే..!

Shivasena: శివసేన తొలిజాబితా విడుదల.. లోక్ సభ అభ్యర్థులు వీరే..!

మహారాష్ట్ర(Maharaashtra)లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఐదు దశల్లో జరగనున్నాయి. 'ఏక్‌నాథ్ షిండే' నేతృత్వంలోని శివసేన(Shivasena) తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను ఖరారు చేసింది.

by Mano
Shivasena: Shivsena's first list released.. These are the Lok Sabha candidates..!

దేశమంతా సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. విడతల వారీగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. మహారాష్ట్ర(Maharaashtra)లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఐదు దశల్లో జరగనున్నాయి.

Shivasena: Shivsena's first list released.. These are the Lok Sabha candidates..!

‘ఏక్‌నాథ్ షిండే’ నేతృత్వంలోని శివసేన(Shivasena) తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ(NDA)లో భాగమైన శివసేన ప్రభుత్వం ఎనిమిది మందిని మాత్రమే ప్రకటించింది.

ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన ‘రాజు పర్వే’ను రాఫ్టిక్ బరిలో దింపారు. ముంబై సౌత్ సెంట్రల్ నుంచి రాహుల్ షెవాలే, షిర్డీ నుంచి సదాశివ్ లోఖండే, బుల్దానా నుంచి ప్రతాపరావు జాదవ్, కొల్హాపూర్ నుంచి సంజయ్ మాండ్లిక్, హత్కనంగలే నుంచి ధైర్యషీల్ మానే  హింగోలి నుంచి హేమంత్ పాటిల్, మావాల్ నుంచి శ్రీరంగ్ బర్నే పోటీ చేయనున్నారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన శివసేనలో చేరగా పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి శివసేన పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే నాయకత్వం పార్టీలో చేరడానికి తనను ప్రేరేపించిందని, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని గోవిందా అన్నారు.

You may also like

Leave a Comment