ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ (INDIA) సత్తా చాటుతోంది. వరుసగా ఆరో రోజు కూడా భారత్ కు పతకాల (Medals) పంట పండింది. తాజాగా ఈ రోజు భారత్ 7 పతకాలను గెలుచుకుంది. అందులో ఐదు పతకాలు షూటింగ్ (Shooting) విభాగంలోనే రావడం విశేషం. టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఒకటి, స్క్వాష్ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నారు.
50 మీటర్ల రైఫిల్ విభాగంలో పురుషుల టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇక మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పసిడి, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మహిళల టీమ్ సిల్వర్ మెడల్, 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సిల్వర్, పురుషుల 50 మీల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో సిల్వర్ మెడల్ ను భారత క్రీడాకారులు అందుకున్నారు.
ఇక టెన్ని విభాగంలో సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ లు వెండి పతకాన్ని గెలుచుకున్నారు. ఇక స్వాష్ మహిళల టీమ్ విభాగంలో జ్యోత్స్న చిన్నప్ప, అనహత్ సింగ్, దీపిక పల్లీకల్, తన్వీ ఖన్నాలు కాంస్య పతకం సాధించారు. ఇక స్విమ్మింగ్ విభాగంలో నైనా వెంకటేష్ నిరాశ పరిచారు. బట్టర్ ఫ్లై హియర్స్ లో 14 వ స్థానంలో నిలిచారు.
బాక్సింగ్ విభాగంలో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటారు. మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించి సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లారు. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్ 32 పతకాలు గెలుచుకుంది. అందులో 8 స్వర్ణాలు, 11 రజతాలు, 12 కాంస్య పతకాలు వున్నాయి.