టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే అనేక రికార్డులు ఆయన సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 26,209 పరుగులు చేశాడు. ఇందులో 111 టెస్టుల్లో 8,676 రన్స్, 288 వన్డేల్లో 13,525, 115 టీ20ల్లో 4,008 పరుగులు ఉన్నాయి. ఈ రికార్డులతో ‘క్రికెట్ కింగ్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కోహ్లీ మరో అరుదైన కొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలోనే మరే బ్యాటర్ సాధించని ఘనతను కోహ్లీ సాధించాడు.
గతేడాది(2022) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ విరాట్ కొట్టిన ఓ సిక్స్‌ను.. ఈ శతాబ్దంలోనే ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’(Shot Of The Century)గా స్వయంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) వెల్లడించింది. ఇదివరకు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ వేసిన ఓ సూపర్ బంతిని ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా ఐసీసీ గుర్తించింది.
ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీంను గెలిపించాడు. ఈ మ్యాచ్ టీమిండియా ఎనిమిది బాల్స్‌లో 28 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, హాఫ్ సెంచరీని పూర్తి చేసే క్రమంలో కోహ్లీ ఓ భారీ షాట్‌ను బాదాడు. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ షాట్‌నే ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’గా ప్రకటించింది ఐసీసీ. 19వ ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాడు కోహ్లీ.
2023 ప్రపంచకప్ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 101 పరుగులు సాధించాడు. దీంతో వన్డే క్రికెట్‌లో 49వ సెంచరీని తన ఖాతాలో వేసుకుని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న 49వ సెంచరీని కింగ్ కోహ్లీ సమం చేశారు. అదేరోజు కోహ్లీ బర్త్‌డే కావడం విశేషం. సచిన్ తన 452వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకోగా విరాట్ మాత్రం కేవలం తన 277వ ఇన్నింగ్స్‌లోనే సాధించారు.