భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హెచ్చరికతో టీమిండియా(Team India) ప్లేయర్లు ఒక్కొక్కరిగా దారికొస్తున్నారు. వెన్ను నొప్పిని సాకుగా చూపుతూ రంజీల్లో ఆడకుండా తప్పించుకు తిరుగుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రంజీ ట్రోఫీ-2024(Ranji Trophy-2024) సెమీఫైనల్లో ఆడేందుకు ఎట్టకేలకు సిద్ధమయ్యాడు.
బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ను తప్పించనున్నట్లు వార్తొలచ్చాయి. వెన్ను గాయం కారణంతో శ్రేయస్ రంజీ క్వార్టర్ ఫైనలు దూరమయ్యాడు. అయితే శ్రేయాస్ ఫిట్‌గా ఉన్నాడని ఎన్సీఏ వైద్య బృందం బీసీసీఐ సెలక్టర్లకు లేఖ రాశారు. దాంతో బీసీసీఐ అతడిపై సీరియస్ అయింది. చివరకు శ్రేయస్ రంజీల్లో ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి ముంబై సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు ప్రచారం నేపథ్యంలో అతడు అలర్ట్ అయ్యాడు. వెన్ను గాయం, ఫామ్‌తో తంటాలు పడుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. అప్పట్లో దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించినా శ్రేయస్ విస్మరించడం చర్చనీయాంశమైంది.
ఇక ఎట్టకేలకు మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు ఈ యంగ్ బ్యాటర్. మరోవైపు వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ కూడా దేశవాళీ బాటపట్టాడు. కుర్రాళ్లు ఐపీఎల్‌పై ఆసక్తితో దేశవాళీ క్రికెట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని భావిస్తోన్న బీసీసీఐ.. దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా నిబంధన తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.