Telugu News » Siddipet : పేదవాడి బ్రతుకు పై బీఆర్ఎస్ నేత దాష్టీకం.. ?

Siddipet : పేదవాడి బ్రతుకు పై బీఆర్ఎస్ నేత దాష్టీకం.. ?

నిరుపేద కుటుంబంపై అధికార పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ (Councilor) దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ (jangaon) పట్టణం సిద్దిపేట (Siddipet)కోర్టు సమీపంలో రోడ్డు పక్కన గుడిసే వేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబంపై కౌన్సిలర్ దాడి చేయడం చర్చాంశనీయంగా మారింది.

by Venu

రాజకీయం అంటే ప్రజా సేవ అని తెలిసిందే.. కానీ నేటి రాజకీయాల రూపు రేఖలు ఇందుకు భిన్నంగా మారాయని, రాజకీయం అంటే అవినీతి, అరాచకం, దోపిడి, స్వార్ధం మొదలగు వీటితో కూడుకొన్నదే నేటి పాలన అని ప్రజలు అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ (Telangana)లో అధికార పార్టీ పై వ్యతిరేక పవనాలు ప్రజల నుంచి వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలోని కొందరు నేతలు రాజకీయ అండ చూసుకొని అమాయకుల పై చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు.

తెలంగాణ సీఎం (CM) ఎన్ని సార్లు చెప్పిన వీరి తీరు మారకపోవడం విచిత్రం అనుకుంటున్నారు జనం.. ఇకపోతే ఓ నిరుపేద కుటుంబంపై అధికార పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ (Councilor) దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ (jangaon) పట్టణం సిద్దిపేట (Siddipet)కోర్టు సమీపంలో రోడ్డు పక్కన గుడిసే వేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబంపై కౌన్సిలర్ దాడి చేయడం చర్చాంశనీయంగా మారింది.

వీరి పై 6వ వార్డు కౌన్సిలర్ నాగరాజు దాడి చేసి.. దౌర్జన్యంగా వారు ఉంటున్న గుడిసెను కూలగొట్టాడని ఆవేదన చెందుతున్నారు.. తాము ఎంత బతిమిలాడినా వినకుండా, తాము వేసుకున్న గుడిసెను కూలగొట్టి, దుర్భాషలాడుతూ దాడి చేశాడని బాధితులు వాపోతున్నారు. తమకు ఉండడానికి ఎలాంటి గూడు లేక రోడ్డు పక్కనే గుడిసె వేసుకొని.. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని ఆ కుటుంబం తెలిపారు.

తమకు ఇక్కడ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కూడా ఉన్నాయని, ఓట్లు కూడా వేశామని, డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా దరఖాస్తు చేసుకున్నామని, అయినా ప్రభుత్వం తమకు ఇప్పటి వరకు ఇల్లు కేటాయించలేదని బాధితులు కన్నీరు పెట్టారు.. మరోవైపు పేదల ప్రభుత్వం అని చెప్పుకొంటున్న నేతలు ఈ ముచ్చట పై ఎలా స్పందిస్తారో మరి చూడాలి అని అనుకొంటున్నారు విషయం తెలుసుకొన్న నెటిజన్స్..

You may also like

Leave a Comment