భార్య భర్తలు అన్నాక.. వారి మధ్య ఎన్నో సర్దుబాట్లు ఉండాల్సి వస్తుంది. అయితే జీవితంలో బాధ్యతలు పెరిగాక, కోపం చిరాకు వంటి ఫీలింగ్స్ కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. వాటిని మీ భాగస్వామిపై చూపించకుండా, మీ బంధాన్ని పటిష్టంగా ఉంచుకోవాలంటే.. ఆ బంధంలో కచ్చితంగా ప్రేమ ఉండాలి. అయితే.. మీ బంధంలో కనిపించే కొన్ని లక్షణాలు మీ బంధంలో ప్రేమ తగ్గింది అని చూపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
పార్టనర్స్ అన్నాక గొడవలు జరుగుతుండడం అనేది సహజం. అయితే ఎప్పుడు చూసినా ఇద్దరు గొడవలు పడుతూనే ఉంటె, మీ మీద మాటలు పడుతూనే ఉంటె మాత్రం ప్రేమ తగ్గిందని అనుకోవచ్చు. ఇక లైంగిక జీవితం కూడా సరిగ్గా లేకుంటే మీ మధ్య ప్రేమ తగ్గిందనే చెప్పొచ్చు. హ్యాపీ కపుల్ ఎప్పుడు మంచి లైంగిక జీవితాన్ని కలిగి ఉంటారు. నెలల తరబడి లైంగికంగా సఖ్యత లేకుంటే మీ మధ్య దూరం పెరిగిందని, ప్రేమ తగ్గిందని గుర్తించండి.
మీ పార్టనర్స్ మీతో కాకుండా ఎక్కువగా వేరే వారితో సమయం గడపడానికి ఇష్టపడుతున్న లేక ఎక్కువ సమయం ఫ్రెండ్స్ తోనే గడపడానికి ఇష్టపడుతున్నా మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గుతోందని అర్ధం. ఇది కమ్యూనికేషన్ ను లేకపోవడాన్ని సూచిస్తుంది. మీ కష్ట సమయాల్లో తోడు ఉండడానికి కూడా ఇష్టపడకపోతుంటే మీపై ప్రేమ తగ్గిందని అర్ధం. పార్టనర్స్ అంటే కష్ట సమయంలో ఒకరినొకరు తోడుగా ఉండడం. కష్ట సమయాల్లో పార్టనర్ ని పట్టించుకోకపోతే కచ్చితంగా వారిద్దరి మధ్య దూరం ఎక్కువ ఉన్నట్లు అర్ధం.