సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ – 2023 (SIIMA) వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శ్రుతి హాసన్, శ్రీలీల, శ్రీనిధి, అశ్వినీ దత్, నిఖిల్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు.
కాగా, 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ (Jr NTR) అవార్డును అందుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రానికి గానూ ఎన్టీఆర్‌కు ఈ అవార్డు వరించింది. ‘ధమాకా’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా శ్రీలీలకు అవార్డు వరించింది. ఇక ఉత్తమ చిత్రంగా సీతారామం, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా రానా (భీమ్లా నాయక్), ఉత్తమ సహాయ నటిగా సంగీత (మసూద)కు అవార్డులు వరించాయి.
ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం), ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా), ఉత్తమ సహాయ నటుడు : రానా (భీమ్లానాయక్), ఉత్తమ దర్శకుడు : ఎస్‌ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్),ఉత్తమ చిత్రం : సీతారామం (వైజయంతీ మూవీస్, స్వప్న మూవీస్), ఉత్తమ సహాయ నటి : సంగీత (మసూద), ఉత్తమ పరిచయ నటి : మృణాల్ ఠాకూర్ (సీతారామం), ఉత్తమ సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తమ సినిమాటోగ్రఫీ : కె.కె సెంథిల్ కుమార్ (ఆర్‌ఆర్‌ఆర్).
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (నాటు నాటు- ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : రామ్ మిరియాల (డీజే టిల్లు), ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ 2), ఉత్తమ పరిచయ దర్శకుడు : మల్లిడి వశిష్ట (బింబిసార), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : అడవి శేష్ (మేజర్), ఉత్తమ నటి (క్రిటిక్స్) : మృణాల్ ఠాకూర్ (సీతారామం), ఉత్తమ హాస్య నటుడు : శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2), ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు) : శరత్, అనురాగ్ (మేజర్)