Telugu News » Siricilla : రాజకీయ పార్టీలకు పద్మశాలీల హెచ్చరిక..?

Siricilla : రాజకీయ పార్టీలకు పద్మశాలీల హెచ్చరిక..?

బీఆర్ఎస్ (BRS) నేతలు అన్నీ పార్టీలకు పెద్దపీట వేస్తున్నామని ప్రచారం చేసుకొంటూ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. సిరిసిల్ల టికెట్ మళ్లీ కేటీఆర్ (KTR)కే ప్రకటించిన కేసీఆర్ (KCR).. సిరిసిల్లాలో పద్మశాలీలకు ఏం న్యాయం చేశారని విమర్శించారు.

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పద్మశాలీలు (Padma Shalilu) రాజ్యాధికార సాధన కోసం రోడ్డు ఎక్కవలసి వచ్చిందని పద్మశాలీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తమకు రాజకీయాల్లో సరైన గుర్తింపు లేదని ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. మరోవైపు రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో పద్మశాలీలు ఆందోళనకు దిగారు. మాకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వడం లేదంటూ రోడ్డెక్కారు.

 

బీఆర్ఎస్ (BRS) నేతలు అన్నీ పార్టీలకు పెద్దపీట వేస్తున్నామని ప్రచారం చేసుకొంటూ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. సిరిసిల్ల టికెట్ మళ్లీ కేటీఆర్ (KTR)కే ప్రకటించిన కేసీఆర్ (KCR).. సిరిసిల్లాలో పద్మశాలీలకు ఏం న్యాయం చేశారని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ 55మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసినా.. సిరిసిల్ల టికెట్ మాత్రం పెండింగ్ లో పెట్టిందని గుర్తు చేశారు.. కాంగ్రెస్ రెండో జాబితాపై పద్మశాలీలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు..

మరోవైపు బీజేపీ పై ఆశపెట్టుకొన్న పద్మశాలీలకు.. బీజేపీ హైకమండ్ హ్యాండ్ ఇచ్చింది.. తొలి జాబితాలో సిరిసిల్ల టికెట్ ను రాణి రుద్రమ రెడ్డికి కేటాయించింది. దీంతో పద్మశాలీలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.. రాజకీయ పార్టీలు తమను గుర్తించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలు పద్మశాలీను గుర్తించి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మశాలీలకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలోకి దించి గెలిపించుకుంటామని హెచ్చరించారు.

You may also like

Leave a Comment