రామ్ పోతినేని హీరోగా వచ్చిన స్కంద సినిమా పెద్దగా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది రామ్ పోతునేని హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఈ సినిమా తెర మీదకు వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గానే నిలిచింది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తమన్ బిజీఏం మాత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. బోయపాటి శ్రీను కథ, కథనంలో కాస్త జాగ్రత్త పడాలని ఆడియన్స్ అంటున్నారు.
రామ్ అభిమానులు మాత్రం వాళ్లకి సినిమా బాగా నచ్చినట్లు చెప్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ ని చూసిన అభిమానులు సినిమాలో ఒక బ్లండర్ మిస్టేక్ ని గమనించి ఆ మిస్టేక్ ని ప్రస్తుతం వైరల్ గా మార్చేస్తున్నారు. ఈ సినిమాలో సీఎం పాత్ర చేసిన శరత్ లోహితస్వ అలానే రామ్ కి జరిగే యాక్షన్స్ సన్నివేశంలో ఒక వ్యక్తిని రామ్ చంపేస్తాడు.
Also read:
అయితే మళ్ళీ శరత్ వెనుక నెక్స్ట్ సీన్ లో కనపడతాడు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఎలా వాస్తాడంటూ ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజెన్స్. బోయపాటి శ్రీను కనుక జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని అంటున్నారు. ఎడిటింగ్ లో పొరపాటు వలన ఇలా జరిగిందని కొంతమంది అంటున్నారు ఈ సీన్ గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్ల విషయంలో బోయపాటి శ్రీను మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.