ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో అందరికీ బాగా దగ్గర అయిపోయారు. ఎన్టీఆర్ ఒకవైపు సినిమాల్లో ఇంకొక రాజకీయాల్లో కూడా మంచి క్రేజ్ సందించుకున్నారు పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో ముఖ్యమైనది. పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలవడం రెండు మనసులు కలవడం ప్రతి ఒక్కరికి పెళ్లి తర్వాత జీవితంలో ఎంతో కొంత మార్పు వస్తుంది కొత్త బంధం మనతో ఏకమవుతుంది కనుక వివాహాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చేసుకోవాలని అనుకుంటుంటారు.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తే పెద్ద పండగలానే ఉంటుంది పెళ్లి అంటే ముందు మనకి గుర్తు వచ్చేది లగ్నపత్రిక. లగ్నపత్రిక చాలా ముఖ్యమైనది టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కూడా పెళ్లి శుభలేఖల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ చేయించుకుని పంచి పెడుతున్నారు. అప్పట్లో లగ్నపత్రికలు కొంచెం సాదాసీదాగా ఉండేవి కానీ ఇప్పుడు వెరైటీ డిజైన్లు కూడా ఉంటున్నాయి. తారక రామారావు బసవతారకాన్ని పెళ్లి చేసుకునే సమయంలో ముద్రించిన పెళ్లి పత్రికని మీరు చూశారా..?
Also read:
ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో పదాలు కాస్త గ్రాంథిక భాషలో ఉన్నాయి. కొమరవోలు అనే గ్రామంలో వీళ్ళ పెళ్లి జరిగింది ఈ పత్రికని గుడివాడలో శ్రీ బాల సరస్వతి ప్రెస్లో ముద్రించారు ఎన్టీఆర్ తమ సొంత మరదలు బసవ తారకంను పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన దంపతులను అనేవారు అంతా. 1985లో బసవతారకం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే తర్వాత ఎన్టీఆర్ ఆమె పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ ని కట్టించి క్యాన్సర్ రోగులకి చికిత్స అందించడం మొదలుపెట్టారు.