టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి సందడి సినిమాతో తెరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి. ఈ క్రమంలో ఇటీవలే గుంటూరు కారం(Guntur karam) సినిమాతో హిట్ అందుకుంది.
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది. అటు చేతినిండా సినిమాలతో, ఇటు డాక్టర్ చదువులతో బిజీగా ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫన్నీ క్వశ్చన్స్ అడగ్గా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది శ్రీలీల. అందులో ఇప్పటివరకు తనకు ఎవరు ప్రపోజ్ చేయలేదని తెలిపింది.
అలాగే తన తల్లికి తెలియకుండా చేసిన అల్లరి పనులు గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ‘మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా.. ఫన్నీ, జోవియల్‌గా ఉండే అబ్బాయి కావాలా?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీలీల వెరైటీ సమాధానమిచ్చింది. తనకు ఫన్నీగా, జోవియల్ గా ఉండే అబ్బాయే కావాలని.. బ్రెయిన్‌తో చేసే పనులు నేను చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.
అంటే పరోక్షంగా తనకు బ్రెయిన్ లేని అబ్బాయి అయినా పర్లేదు అనట్లు మాట్లాడింది ఈ బ్యూటీ. ప్రస్తుతం శ్రీలీల డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో, విజయ్ దేవరకొండ జోడిగా మరో సినిమాలో నటిస్తోంది. గుంటూరు కారం తర్వాత ఈ హీరోయిన్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.