మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy).. రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ఫైర్ అయ్యారు.. పాలమూరు (Palamuru)లో సీఎం మాట్లాడిన తీరు బాగోలేదని…వెంటనే ఆయన తీరు మార్చుకోవాలనని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను రేవంత్ ఇష్టానుసారంగా తిడుతున్నారని మండిపడ్డారు. సీఎం అయ్యాక కూడా భూతులు తిట్టడమే పనిగా ఎంచుకొన్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి భాష సరైంది కాదన్న నిరంజన్ రెడ్డి.. ఆయన మాట్లాడే భాష పై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై ఉన్మాద భాష మాట్లాడుతున్నాడన్నారు. 90 రోజుల నుంచి ఆయన మాట్లాడే భాషను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బొంద పెడతాం, మానవ బాంబులు అయితాం, పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడటం సరైన విధానం కాదని సూచించారు.
మరోవైపు రేవంత్ ని కానీ మరేవరిని కానీ మేము ఎన్నడు ఏమీ అనలేదని తెలిపిన నిరంజన్ రెడ్డి.. తాము ప్రభుత్వాన్ని పడగొడుతామని ఎక్కడ చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళతోనే, ఆయనకు ప్రమాదం ఉందని తెలిపారు.. అందుకే అలా మాట్లాడుతున్నారని వెల్లడించారు. పాలమూరు బిడ్డా రేవంత్ రెడ్డి కాదన్న నిరంజన్.. చంద్రబాబు నాయుడు తొత్తు బిడ్డ అని విమర్శించారు..
ఈసారి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు.. అందుకే మోడీని భడే బాయ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. 90 రోజులు కాకముందే ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న సీఎం.. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 100 యేండ్ల విధ్వంసం జరిగిందని రేవంత్ మాట్లాడుతున్నారు.. కానీ 10 యేండ్లలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని నిరంజన్ ప్రశ్నించారు.