బాలీవుడ్ నటి సన్నీలియోన్(Actress Sunny Leone) ఇన్నాళ్లు తన మనసు దాచుకుని బాధపడుతున్న ఓ విషయాన్ని బయటపెట్టింది. ఎంటీవీలో ప్రసారమయ్యే ‘సిట్స్ విల్లా(Sits Villa)’ ఐదో సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది సన్నీ లియోన్. ఆ షోలో భాగంగా మహిళా కంటెస్టెంట్ దేవాంగిని వ్యాస్ తన మాజీ ఫియాన్సీ గురించి మాట్లాడగా.. సన్నీ కూడా తన విషాద ప్రేమ గాథను గుర్తుచేసుకుంది.
సన్నీ లియోన్ మాట్లాడుతూ.. ‘నా భర్త డేనియల్ వెబర్‌ను కలవడానికి ముందు నాకు ఎంగేజ్మెంట్ అయింది. ప్రేమించిన వ్యక్తితోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటికే మా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. హవాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. ఆ సమయంలో అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని ఎందుకో అప్పుడు అనిపించింది.’ అని తెలిపింది.
‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని అతడిని నేరుగా ఆడిగేశా. దానికి అతడు లేదని చెప్పాడు. ఇకపై నిన్ను ప్రేమించను అని చెప్పాడు. ఆక్షణం నా మనసు ముక్కలైంది. ఎంతో బాధపడ్డాను.’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ఆ సమయంలో అతడు నా హృదయాన్ని గాయపరిచాడు. ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలా రోజులు ప్రయత్నించా.’అంటూ సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది.
ఆ సమయంలోనే దేవుడు నాకోసం డేనియల్ వెబర్‌ను పంపాడని, కష్ట సమయాల్లో అండగా నిలబడ్డాడని తెలిపింది. అమ్మా, నాన్న చనిపోయినప్పుడూ నావెంటే ఉన్నాడని చెప్పింది. ఎప్పటికీ తన భర్త చేయి వదలనని సన్నీ చెప్పుకొచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోనూ సన్నీ నటిస్తోంది. తెలుగులో చివరగా ‘జిన్నా’ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.