Telugu News » Superstar Krishna Statue: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్..!

Superstar Krishna Statue: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్..!

విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు. భారతీయుడు 2 షూటింగ్‌లో బీజీగా ఉన్న కమల్ విజయవాడకు చేరుకుని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రత్యేకతను సంతరించుకుంది.

by Mano
Superstar Krishna Statue: Kamal Haasan unveiled the Superstar Krishna statue..!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) విగ్రహావిష్కరణను విజయవాడ (Vijayawada)లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ విగ్రహాన్ని సినీ నటుడు, పద్మ భూషణ్ కమలహాసన్(Kamal Haasan) ఆవిష్కరించడం విశేషం. భారతీయుడు 2 షూటింగ్‌లో బీజీగా ఉన్న కమల్ విజయవాడకు చేరుకుని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రత్యేకతను సంతరించుకుంది.

Superstar Krishna Statue: Kamal Haasan unveiled the Superstar Krishna statue..!

ఈ సందర్భంగా విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు. సూపర్‌ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ఆనందం వ్యక్తం చేశారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్‌కు కృష్ణ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని కొనియాడారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ కృష్ణకు మంచిపేరు తెస్తున్నారని అవినాష్ అన్నారు. కాగా కమల్‌హాసన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

You may also like

Leave a Comment