Telugu News » Asian Games : ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఆ మార్క్ చేరుకున్న భారత్….!

Asian Games : ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఆ మార్క్ చేరుకున్న భారత్….!

ఈ రోజ మహిళల కబడ్డీలో పసిడి పతకాన్ని భారత క్రీడాకారులు సాధించారు.

by Ramu
Sweetest century in Indian sports history

ఆసియా క్రీడ (Asian Games )ల్లో భారత్ సత్తా చాటుతోంది. తాజాగా ఈ క్రీడల్లో భారత పతకాల సంఖ్య 100కు చేరుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 100 పతకాల (Medals) మార్క్ ను చేరుకుని చరిత్ర సృష్టించింది. శనివారం కూడా భారత పతకాల జోరు కొనసాగుతోంది. ఈ రోజ మహిళల కబడ్డీలో పసిడి పతకాన్ని భారత క్రీడాకారులు సాధించారు.

Sweetest century in Indian sports history

అర్చరీలో పురుషుల టీమ్ విభాగంలో బంగారు, వెండి పతకాలను భారత క్రీడాకారులు అందుకున్నారు. ఆర్చరీ పురుషుల కాంపౌండ్‌ సింగిల్స్‌లో ఓజాస్‌ ప్రవీణ్‌ డియోటలే పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఆసియా క్రీడల్లో ఆయన ఇది మూడో స్వర్ణం కావడం విశేషం. ఇక పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో అభిషేక్ వర్మ సిల్వర్ పతకాన్ని చేజిక్కిచ్చుకున్నారు.

మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ జ్యోతి గోల్డ్ పతకాన్ని అందుకున్నారు. ఇక మరో షూటర్ అదితి కాంస్య పతకాన్ని సాధించారు. భారత్ కు ఇప్పటి వరకు 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు వచ్చాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. రెజ్లింగ్ లో భారత రెజ్లర్ యశ్ సత్తా చాటాడు. కంబోడియాకు చెందిన చెంగ్ చియాన్ పై 10-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించారు.

క్వార్టర్ ఫైనల్ లో తజకిస్తాన్ కు చెందిన మ్యాగోమెట్ ఎవలోవ్ తో యశ్ పోటీ పడనున్నాడు. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు చైనాకు మొత్తం 354 మెడల్స్‌ వచ్చాయి. అందులో 187 బంగారు, 104 వెండి, 63 కాంస్యా పతకాలలు ఉన్నాయి. ఆ తర్వాత 169 మెడల్స్‌తో జపాన్‌ రెండో స్థానంలో వుంది. 47 పసిడి, 57 రజతం, 65 కాంస్య పతకాలు వున్నాయి.

You may also like

Leave a Comment