Telugu News » Tamil Nadu : కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడు.. ఏడుగురు మృతి..!!

Tamil Nadu : కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడు.. ఏడుగురు మృతి..!!

తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధాని చెన్నై (Chennai)తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నైలోని పలు కాలనీలు నీట మునిగపోయాయి. దీంతో రవాణా స్తంభించిపోయింది. రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరోవైపు భారీగా ప్రవహిస్తున్న వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్నాయి.

by Venu

ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. రాష్ట్రాల పై విరుచుకు పడుతున్న తుఫానుల వల్ల పలు చోట్ల ప్రాణనష్టం కూడా జరుగుతుంది. కుండపోత వర్షాలతో తమిళనాడు (Tamil Nadu) అతలాకుతలమైంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధాని చెన్నై (Chennai)తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నైలోని పలు కాలనీలు నీట మునిగపోయాయి. దీంతో రవాణా స్తంభించిపోయింది. రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరోవైపు భారీగా ప్రవహిస్తున్న వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్నాయి.

దీంతో చెన్నై పోలీసు విభాగం, విపత్తు పునరుద్ధరణ విభాగం సహాయ చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కాగా ప్రస్తుతం వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఇక తమిళనాడులో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను (Michong Typhoon) మంగళవారం తీరం దాటే అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలలో సెలవు ప్రకటించింది.

ప్రస్తుతం చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో ఉన్న తుఫాన్ మధ్యాహ్ననికి నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఈశాన్య జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి.

You may also like

Leave a Comment